మీ ఇంటి దగ్గర నుండి ఆన్లైన్ పాఠాలు చెప్పి తేలికగా డబ్బులు సంపాదించుకోవచ్చు.

మీరు పాఠశాలలో లేక కళాశాలలో టీచర్ ఉద్యోగం పొందడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. టీచర్ ఉద్యోగానికి సంబంధించి చదువు మొత్తం పూర్తీ కావాలి, పరిక్షలు రాయాలి, ట్రైనింగ్ తీసుకోవాలి. ఇలా కొన్ని ఉన్నాయి. మీరు టీచర్ ఉద్యోగం పొందకుండానే ఇంటి దగ్గర నుండి డబ్బులు సంపాదించవచ్చు. ఆన్లైన్ ద్వారా పాఠాలు చెబుతూ, ఎక్కడైనా డబ్బులు సంపాదించవచ్చు.

 

మీ దగ్గర మంచి టీచింగ్ ప్రతిభ ఉంటె, కొన్ని గంటలు పాఠాలు చెప్పి చాల సులభంగా డబ్బులు సంపాదించుకోవచ్చు. మీరు 4 గంటలు పాటు టీచింగ్ చేస్తే, రూ. 25,000 పైన వస్తాయి. మీరు ఎక్కువ సమయం టీచింగ్ చేస్తే, రూ. 75,000 వరకు వస్తాయి. చదువు కొనసాగిస్తూ కూడా, మీ కాళీ సమయం లో టీచింగ్ చేస్తూ, డబ్బులు సంపాదించుకోండి. ఆన్లైన్ లో పాఠాలు చెప్పి, డబ్బులు పొందే విధానం ఈ క్రింద ఉన్నాయి.

 

మీరు ఆన్లైన్ పాఠాలు చెప్పడానికి కొన్ని వెబ్సైట్ ఉన్నాయి. వాటిలో రిజిస్టర్ చేసుకోవాలి. మీ వివరాలు వెబ్సైట్ లో అప్లై చేయాలి. మీ ప్రొఫైల్ ను కంపెనీ వారు చెక్ చేస్తారు. మీ ప్రొఫైల్ ని బట్టి, మీకు ఒక టాపిక్ ఇస్తారు. దానిపైన మీరు డెమో క్లాస్ చేయవలసి ఉంటుంది. మీరు డెమో క్లాస్ విజయవంతంగా చూపిన తర్వాత, వాళ్ళు మీకు ట్రైనింగ్ ఇస్తారు. ఎలా పాఠాలు చెప్పాలి అనే విషయాలు గురించి ట్రైనింగ్ ఇస్తారు.

 

ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత, మీకు ముందు ఒక ఆన్లైన్ క్లాస్ ఇస్తారు. మీరు పరిపూర్ణముగా టీచింగ్ చేస్తే, మీకు తరచుగా ఆన్లైన్ క్లాస్ వస్తాయి. క్లాస్ తీసుకునే వాళ్ళు సంతృప్త్తి పొందితే, మీకు ఎప్పుడు ఆన్లైన్ క్లాస్ వస్తూనే ఉంటాయి. మీరు మరింత ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చు. మీరు చెప్పే క్లాస్ బట్టి పేమెంట్ వస్తుంది. మీ పేమెంట్ ను ప్రతి నెల, మీ బ్యాంకు అకౌంట్ కు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు.
Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*