ఫారం ఫిల్లింగ్ & డేటా ఎంట్రీ ఇతర నచ్చిన పనులు చేసి డబ్బులు సంపాదించుకోండి.

రోజు చాల మంది తమకు నచ్చిన పనులే చేయాలనుకుంటారు డబ్బులు సంపాదించే విషయంలో ఐతే చాల మంది తమకు నచ్చిన పని చేసి డబ్బులు సంపాదించాలి అనుకుంటారు. అమెజాన్ మెకానికల్ టర్క్. దీనిలో చాల రకాల వర్క్స్ ఉంటాయి. ఫారం ఫిల్లింగ్, డేటా ఎంట్రీ, సర్వే వర్క్స్, కాపీ పేస్ట్, ఆర్టికల్ రైటింగ్ మెదలైన వర్క్స్ ఉంటాయి. మీకు నచ్చిన వర్క్ చేసి డబ్బులు సంపాదించుకోవచ్చు. ఈ కంపెనీ చాలా పాతది. ఈ సైట్ చాల జెన్యూన్ పేమెంట్ ఇస్తుంది. ఈ కంపెనీ లో నిజాయితీగా పని చేసే వారు ఎవరైనా డబ్బులు సంపాదించుకోవచ్చు. మీరు ఈ కంపెనీ లో వర్క్ చేయాలంటే, కంపెనీ వారు మిమ్మల్ని ఆక్సిప్టు చేయాలి. మీరు సైన్ అప్ చేసుకునేటప్పుడు సరైన సమాచారం ఇస్తేనే, వారు ఆక్సిప్టు చేస్తారు. మీరు సైన్ అప్ చేసే కునే విధానం ఈ క్రింద ఉన్నది. మీరు దాని ప్రకారం సరైన సమాచారం ఇచ్చి సైన్ అప్ చేసుకోండి.

 

mturk వెబ్సైటు ఓపెన్ చేయండి. సైన్ ఇన్ అస్ ఆ వర్కర్ పైన నొక్కండి. మీకు అకౌంట్ లేదు కాబట్టి, create your amazon account పైన నొక్కండి. మీ పేరు మరియు ఇమెయిల్ ఎంటర్ చేయాలి. పాస్వర్డ్ పెట్టుకోవాలి. 6 క్యారెక్టర్ కన్నా ఎక్కువ మీ పాస్వర్డ్ ఉండాలి. Create your amazon account ఆప్షన్ పైన నొక్కండి. దేశం సెలెక్ట్ చేసుకోవాలి. మీ పూర్తీ పేరు ఎంటర్ చేయాలి. మీరు మీ బ్యాంకు అకౌంట్ లో ఎలా ఉంటె, అలానే మీ ఫుల్ పేరు ఎంటర్ చేయాలి. లేక పొతే పేమెంట్ తీసుకునేటప్పుడు ప్రాబ్లమ్ అవుతుంది. మీ అడ్రస్, సిటీ, స్టేట్ ఎంటర్ చేయాలి. జిప్ లేదా పోస్టల్ కోడ్ మరియు ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలి. మీరు అమెజాన్ మెకానికల్ టర్క్ గురించి ఎలా విన్నారు? అని ప్రశ్న ఉంటుంది. మీకు ఎలా తెలుసో చేసుకోవాలి . మీరు MTurk site లో పనులను పూర్తి చేయడానికి ప్రాధమిక కారణం ఏమిటి? అని ప్రశ్న ఉంటుంది. ఐ వాంట్ టు ఏఅర్న్ రివార్డ్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. Create account పైన నొక్కండి. మీ అకౌంట్ create అవుతుంది. మీకు ఈ క్రింది మెసేజ్ చూపిస్తుంది.

 

మేము అమెజాన్ మెకానికల్ టర్క్లో చేరడానికి మీ అభ్యర్థనను సమీక్షిస్తున్నాము. మేము మా సమీక్ష పూర్తి అయినప్పుడు లేదా మీ ఆహ్వానం అందుబాటులో ఉన్నప్పుడు మేము సైన్ ఇన్ చేసిన అమెజాన్ ఖాతాకు ఇమెయిల్ పంపుతాము. ఇంతలో, మీరు ఒక అమెజాన్ మెకానికల్ టర్క్ వర్కర్ గురించి మరింత తెలుసుకోవాలనుకుంటే, దయచేసి మా చదవండి. అని ఉంటుంది. మీ అకౌంట్ 3 రోజుల్లో అప్రూవ్ అవుతుంది. తరువాత మీరు వర్క్ మొదలు పెట్టుకోవచ్చు.

 

అమెజాన్ మెకానికల్ టర్క్ పని విధానం

మీ అకౌంట్ ఓపెన్ చేసిన తరువాత హిట్స్ అని ఉంటుంది. అవి మీరు చేయవలసిన పనులు. మీకు నచ్చిన వర్క్ వెతకండి. ఆ వర్క్స్ సంబంధించినవి వస్తాయి. ప్రతి వర్క్ కి సమయం ఉంటుంది. ఆ సమయం లోపు వర్క్ పూర్తీ చేయాలి. మీరు ఏదైనా వర్క్ ఓపెన్ చేసిన తరువాత, ఎన్ని హిట్స్ అంటే ఎన్ని వర్క్స్ అందుబాటులో ఉన్నాయి అని చూపిస్తుంది. మీరు ఏదైనా వర్క్ చేయాలంటే ఆక్సిప్టు హిట్ ను నొక్కండి. వర్క్ పూర్తీ చేసే విధానం మరియు నియమ నిబంధనలు అక్కడ ఉంటాయి. వాటి ప్రకారం మీరు వర్క్ చేసి సబ్మిట్ చేయాలి. మీరు చేసిన వర్క్ కంపెనీ వారు చెక్ చేసి పేమెంట్ ఇస్తారు. మీరు సరిగ్గా చేస్తేనే పేమెంట్ ఇస్తారు, మీరు తప్పు చేసిన వర్క్ రిజెక్ట్ అవుతుంది. మీరు సరిగ్గా చేసిన వర్క్స్ కు మాత్రమే మనీ మీ అకౌంట్ లో ఆడ్ అవుతుంది. మీరు $10 డాలర్స్ సంపాదించినా తరువాత పేమెంట్ వస్తుంది . మీకు పేమెంట్ రావాలంటే ముందు మీరు మీ ఇది ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ మరియు బ్యాంకు డీటెయిల్స్ వెరిఫై చేయాలి. తరువాత మీరు పేమెంట్ రిక్వస్ట్ పెట్టాలి. కంపెనీ వారు మీకు బ్యాంకు ఖాతా కు లేదా చెక్ ద్వారా పేమెంట్ ఇస్తారు. మీరు ఏ పేమెంట్ మెథడ్ పెట్టుకుంటే దానికి పేమెంట్ పంపుతారు.
Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*