ఇంటి నుండి పని మరియు మా వెబ్సైటు గురించి.

ఇంటి నుండి చేసే పనులు కొన్ని ఉంటాయి. ఇంటి నుండి కంప్యూటర్ ద్వారా చేసే పనులు ఎక్కువగా ఉంటాయి. కంప్యూటర్ లేక స్మార్ట్ ఫోన్ ద్వారా ఎవరైనా పనులు చేసుకోవచ్చు. విద్యార్థులు, గృహిణులు, ఉద్యోగం లేనివారు మరియు ఉన్నవారు, ఎవరైనా కంప్యూటర్ ద్వారా వర్క్స్ చేసి డబ్బులు సంపాదించుకోవచ్చు. కంప్యూటర్ ద్వారా చేసే వర్క్స్ లో రెండు రకాలు ఉంటాయి. 1) ఆన్లైన్ వర్క్స్ (Online)  2) ఓఫ్ఫ్లిన్ (Offline) వర్క్స్ . ఆన్లైన్ లో చేసే వర్క్స్ కొన్ని రకాలు ఉంటాయి. ఓఫ్ఫ్లిన్ లో చేసే వర్క్స్ కొన్ని రకాలు ఉంటాయి. కంప్యూటర్ లేదా స్మార్ట్ ఫోన్ ద్వారా చేసే వర్క్స్ లో ఆన్లైన్ వర్క్స్ కొన్ని నిజమైనవి ఉంటాయి. ఓఫ్ఫ్లిన్ వర్క్ మొత్తం నిజమైనవి కావు.

 

ఇంటి నుండి పని ఉద్యోగాల నష్టాలు.

కంప్యూటర్ లేదా మొబైల్ ద్వారా ఇంటి నుండి చేసే పనులలో లాభాల కంటే ముందు నష్టాలు ఉంటాయి. కీడు ఎంచి మేలు ఎంచామన్నారు పెద్దలు. కావున ముందు నష్టాల గురించి చెబుతాను. ఆన్లైన్ మరియు ఓఫ్ఫ్లిన్ ఉద్యోగాల వలన వచ్చే నష్టాలను ఇప్పుడు చూద్దాం.

 

Offline ఉద్యోగాల వలన నష్టాలు

ఓఫ్ఫ్లిన్ వర్క్స్ అంటే దాదాపు డేటా ఎంట్రీ మరియు ఇతర వర్క్స్ ఉంటాయి. మీరు ఏ వర్క్ లో ఐన కూడా జాయిన్ అవ్వాలంటే, మీ దగ్గర నుండి రిజిస్ట్రేషన్, చార్జెస్, డిపోసిట్, పేరుతొ కొంత డబ్బులు పే చేయమని అడుగుతారు. మీరు పే చేసి వర్క్ తీసుకోని సబ్మిట్ చేసేటపుడు వాళ్ళు రెస్పాన్స్ అవ్వరు. ఒకవేళ ఐన కూడా మీరు చేసిన వర్క్స్ లో మిస్టేక్స్ ఉన్నాయి అని చెప్పి మీకు పేమెంట్ ఇవ్వరు. ఓఫ్ఫ్లిన్ డేటా ఎంట్రీ వర్క్స్, Ms word లో ఎక్కువగా ఇలాంటి మోసాలు జరుగుతాయి. ఓఫ్ఫ్లిన్ డేటా ఎంట్రీ Ms word లో చేసే వర్క్ 99% ఫేక్ ఉంటాయి. మిగితా ఓఫ్ఫ్లిన్ వర్క్స్ లో కూడా డబ్బులు కటించుకొని వర్క్ ఇస్తారు చేసిన తర్వాత రెస్పాన్స్ అవ్వరు లేదా పేమెంట్ ఇవ్వరు. మీరు కొన్ని ఆన్లైన్ వర్క్స్ చేసి నిజంగా కొంత డబ్బులు డబ్బులు సంపాదించుకోవచ్చు. డబ్బులు కట్టించుకుని వర్క్ ఇచ్చే ఏ కంపెనీ నిజమైనది కాదు. డబ్బులు కట్టి వర్క్ చేసే దేనిలో పేమెంట్ రాదు.

 

డబ్బులు పే చేసి ఓఫ్ఫ్లిన్ వర్క్స్ తీసుకోని చేయడం వలన మీ డబ్బులు మరియు సమయం వృధా అవుతాయి. ఓఫ్ఫ్లిన్ వర్క్స్ వలన చాల మంది తమ డబ్బులు మరియు సమయం వృధా చేసుకుంటున్నారు. మీరు ఎన్ని సార్లు డబ్బులు పే చేసి వర్క్ తీసుకోని చేసిన సమయం మరియు డబ్బులు వృధా అవుతాయి. కావున మీరు ఓఫ్ఫ్లిన్ వర్క్స్ గురించి ప్రయత్నాలు చేయడం ఆపివేయడం మంచిది. ప్రయత్నం చేస్తాము అంటే మీ ఇష్టం. ఏది చేసిన డబ్బులు పెట్టకుండా చేయండి. ఖాళీగా ఉన్నవారికి సమయం వృధా ఐతే పర్లేదు. కానీ డబ్బులు మాత్రం వృధా చేసుకోకండి.

 

మన తెలుగు వాళ్ళు డబ్బులు వృధా చేసుకోవడం నాకు ఇష్టం లేదు. తెలుగు వాళ్ళు ఎవరి దగ్గర మోసపోకూడదు. సమయాన్ని వృధా చేసుకుంటే, వర్క్ పట్ల కొంత అనుభవం వస్తుంది ఏమో కానీ డబ్బులు వృధా చేసుకుంటే, తీవ్ర మనస్తాపానికి గురి అవుతారు. జీవితం లో అన్ని వర్క్స్ ఫేక్ అని అనుకుంటారు. ఏ వర్కును మీరు నమ్మరు. చివరికి ఏమి సాదించలేము అని అనుకుంటారు.

 

 

ఇంటి నుండి పని ఉద్యోగాల లాభాలు.

ఇంటి నుండి చేసే పనులు మీరు ఇంటిలో మరియు ఎక్కడైనా చేసుకోవచ్చు. మీకు కంప్యూటర్ మరియు నెట్ కనెక్షన్ అందుబాటులో ఉంటె చాలు. సమయ పరిమితి మరియు టార్గెట్ ఉండవు. పని వత్తిడి ఉండదు. మీరు రోజు నచ్చినంత సేపు పని చేసుకోవచ్చు. మీరు ఏ సమయంలోనైనా కూడా పని చేసుకోవచ్చు. మీకు మిరే బాస్. ఇంటి నుండి పని చేయడం ద్వారా మీ స్నేహితులలో మరియు బంధువులలో మీకు ఒక ప్రత్యేకమైన గౌరవ మర్యాదలు మరియు గుర్తింపు ఉంటాయి.

 

 

Surelyjobs వెబ్సైటు గురించి

ఈ వెబ్సైటు ప్రజలకు సేవ చేయడానికి ప్రారంభించబడింది. ఈ వెబ్సైటు ద్వారా ఉచితంగా పరిజ్ఞానము మరియు డబ్బులు సంపాదించుకోవచ్చు. మా వెబ్సైటు లో కంప్యూటర్ లేదా స్మార్ట్ ఫోన్ ద్వారా ఆన్లైన్ లో చేసే ఉద్యోగాలు గురించి చెప్పడం జరిగింది. పెట్టుబడి పెట్టకుండా ఈ వెబ్సైటు లో ఉన్న సమాచారం ద్వారా ఎవరైనా ఎక్కడైనా ఆన్లైన్ లో డబ్బులు సంపాదించుకోవచ్చు. మేము నేరుగా ఉద్యోగాలు ఇవ్వము. ఉద్యోగాల గురించి సమాచారం మాత్రమే ఇస్తాము. జెన్యూన్ పేమెంట్ ఇచ్చే వర్క్స్ గురించి ఈ వెబ్సైటు లో ఉంటాయి. మేము ఈ వెబ్సైటు లో తరచుగా కొత్త ఉద్యోగాల గురించి పోస్ట్ చేస్తూ ఉంటాము. మీరు వాటిని చదువుకుని పరిజ్ఞానము మరియు డబ్బులు సంపాదించండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటె,కాంటాక్ట్ ఫారం ద్వారా మమల్ని సంప్రదించండి.